రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ ఎన్నికల్లో 159 చోట్ల తమ పార్టీ అభ్యర్థుల నామినేషన్లను చిన్న కారణాలను సాకుగా చూపి రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారని తెదేపా ఒక ప్రకటనలో తెలిపింది. ఇది గురువారం రాత్రి 9 గంటల వరకు అందిన సమాచారమేనని, నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందున ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 113 చోట్ల నామినేషన్లను తిరస్కరించినట్లు తెలిపింది. కుల ధ్రువీకరణ పత్రాలు, నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇవ్వలేదన్న కారణంతో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా నామినేషన్లను తిరస్కరించినట్లు వెల్లడించింది.
'159 చోట్ల తెదేపా ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ'
రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది. అయితే చిన్నపాటి సాకులతో తమ అభ్యర్థుల నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు తిరస్కరిస్తున్నారని తెదేపా వెల్లడించింది. చిత్తూరు జిల్లాలో భారీగా నామినేషన్లను తిరస్కరించారని తెలిపింది.