పుత్తూరు పోలీస్ స్టేషన్లో ఎర్రచందంనం దుంగలు చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం మద్దికుంట వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు . తిరుపతి నుంచి చెన్నై వెళ్తున్న బొలెరో వాహనంలో 25 చందనం దుంగలను గుర్తించినట్లు పుత్తూరు డీఎస్పీ తెలిపారు. వాటితో పాటూ కార్తీక్ అనే స్మగ్లర్ను అరెస్టు చేశామన్నారు. వాటి విలువ సుమారు ఏడు లక్షల రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు.