ETV Bharat / state

ఈ స్మగ్లర్ల తెలివి చూసి ఆశ్చర్య పోవాల్సిందే! - smuggling news

ఎర్రచందనం దొంగలు రోజురోజుకు కొత్త ఎత్తులు వేస్తున్నారు. పోలీసులకు దొరక్కుండా చిత్తూరు జిల్లాలో రోజుకో మార్గంలో కలప తరలిస్తున్నారు. ఇన్నాళ్లు రోడ్డు, సముద్ర మార్గాలకే పరిమితమైన ఎర్ర చందనం స్మగ్లింగ్‌ను కొంతమంది కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. విమానాల్లోనూ అక్రమ రవాణా చేయడానికి ప్రయత్నించి అధికారులకు దొరికిపోయారు.

Red sandalwood logs are being smuggled in bedsheets at chennai airport
చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎర్ర చందనం
author img

By

Published : Feb 11, 2021, 12:52 PM IST

చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో అత్యంత ఖరీదైన ఎర్రచందనం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. ఇన్నాళ్లూ రోడ్డు, సముద్ర మార్గాలకే పరిమితమైన అక్రమ రవాణా ఇప్పుడు వాయు మార్గంపైనా పడింది. ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తుండగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు పట్టుకున్నారు.

చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎర్ర చందనం

బెడ్‌షీట్స్‌ తరలింపు పేరుతో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన పార్సిల్‌ బాక్సులను తనిఖీ చేయగా.. వాటిలో ఎర్రచందనం దుంగలను చూసి కస్టమ్స్‌ అధికారులు విస్తుపోయారు. అట్టపెట్టెల్లో బెడ్‌షీట్స్‌ కప్పి తరలిస్తున్న.. 500 కిలోల దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు పాతిక లక్షలు ఉంటుందని అంచనా వేశారు.

ఇదీ చూడండి: ఆ ఘటనలో ఎస్సైపై రూమర్స్ సృష్టించారు: డీఎస్పీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.