నిన్నటి దాకా మండుటెండలతో ఠారెత్తిన తిరుపతిలో ఈ రోజు జోరుగా వర్షం కురిసింది. నగరంలో పలు రహదారులు వర్షం నీటితో జలమయమయ్యాయి. ఏకధాటిగా కురిసిన వర్షంతో పలు చోట్ల కాలువలు పొంగిపొర్లగా...కరోనా లాక్డౌన్ వేళ రహదారులపై ఎక్కడా వర్షపు నీరు నిలవకుండా పారిశుద్ధ్య కార్మికులు కృషి చేస్తున్నారు. నగరంలో రహదారులపైకి ప్రజలెవ్వరినీ రానీయకుండా పోలీసులు కట్టుదిట్టంగా లాక్డౌన్ను అమలు చేస్తున్నారు.
ఇదీ చదవండి: లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేస్తాం: కలెక్టర్