చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం గట్టు గ్రామంలో ఓ యువకుడు మహిళలపై వేధింపులకు పాల్పడిన కేసులో... మరో నలుగురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదుతో... నిందితుడిని బి.కొత్తకోట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విచారణలో ఈ కేసులో మరో నలుగురు మైనర్ బాలురు ఉన్నట్లు గుర్తించి... వారిని అదుపులోకి తీసుకున్నారు. మహిళలు అధైర్యపడొద్దని... ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి సూచించారు.
ఇదీ చదవండి: మహిళపై వేధింపులు.. యువకునికి దేహశుద్ధి..