తిరుపతి అర్బన్ జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సమస్యలు సత్వరమే తీర్చేందుకు సిద్ధంగా ఉండాలని ఎస్పీ అన్బురాజన్ అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంలో భాగంగా సమ సమాజ సందర్శన అనే సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ వెల్ఫేర్ నిధులతో తాగునీటి సమస్యను తీర్చే ప్రయత్నం చేసారు.పైలెట్ ప్రాజెక్టు కింద చంద్రగిరి మండలం ముంగిలిపట్టు ఎస్సీ కాలనీలో తాగునీటి ట్యాంకు ఏర్పాటు చేశామని తెలిపారు. తమ ప్రయత్నానికి ప్రజల సహకారం కావాలన్నారు. సమస్యను సత్వరం పరిష్కరించిన సీఐ, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
పోలీసుల సమసమాజ సందర్శిని కార్యక్రమం - tirupati
తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ సమ సమసమాజ సందర్శిని కార్యక్రమంలో భాగంగా చంద్రగిరి మండలం ముంగిలిపట్టు ఎస్సీ కాలనీ గ్రామ ప్రజల దాహాన్ని తీర్చారు. తాగు నీటి సమస్యను సత్వరం పరిష్కరించడంలో సఫలీకృతులుయ్యారని సిబ్బందిని, సి. ఐ ని ఎస్పీ అభినందించారు.
తిరుపతి అర్బన్ జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సమస్యలు సత్వరమే తీర్చేందుకు సిద్ధంగా ఉండాలని ఎస్పీ అన్బురాజన్ అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంలో భాగంగా సమ సమాజ సందర్శన అనే సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ వెల్ఫేర్ నిధులతో తాగునీటి సమస్యను తీర్చే ప్రయత్నం చేసారు.పైలెట్ ప్రాజెక్టు కింద చంద్రగిరి మండలం ముంగిలిపట్టు ఎస్సీ కాలనీలో తాగునీటి ట్యాంకు ఏర్పాటు చేశామని తెలిపారు. తమ ప్రయత్నానికి ప్రజల సహకారం కావాలన్నారు. సమస్యను సత్వరం పరిష్కరించిన సీఐ, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
ప్రతి నీటి బొట్టును ఆదా చేయడమే లక్ష్యం
* రాష్ట్ర సూక్ష్మ నీటి పారుదల పథకం రాష్ట్ర అధికారి (ఓఎస్ డి) వి.హనుమంతరావు.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధి లావేరు మండలంలో శుక్రవారం రాష్ట్ర సూక్ష్మ నీటి పారుదల పథకం అధికారి (ఓ ఎస్ డి) వి.హనుమంతరావు బిందు, తుంపర సేద్యం పరికరాల వినియోగంపై లావేరు గ్రామంలో రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి నీటి బొట్టును ఆదా చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదశ్ రాష్ట్ర సూక్ష్మ నీటి పారుదల పథకం కింద బిందు సేద్యం పరికరాలను బిసి, ఓసి రైతులకు 90 శాతం రాయితీపై అందించగా ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం రాయితీపై అందిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా తుంపర సేద్యం పరికరాలను అన్ని వర్గాల రైతులకు 50 శాతం రాయితీపై అందిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో 2.40 లక్షల హెక్టార్లలో బిందు, తుంపర సేద్యం పరికరాలు ఏర్పాటు చేయడానికి లక్ష్యంగా చేసుకున్నామని తెలిపారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 2019-2020 ఏడాదిలో 24 వేల ఎకరాల్లో ఏపీఎంఐపీ ద్వారా విందు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది శ్రీకాకుళం జిల్లాలో ఎనిమిది వేల హెక్టార్లుల్లో బిందు, తుంపర సేద్యం పరికరాలు ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లా నుంచి 2,400 మంది రైతులు పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. జిల్లాలో లో రణస్థలం, లావేరు మండలాల్లో అత్యధికంగా వాణిజ్య, ఉద్యానవన, వ్యవసాయ పంటలకు బిందు, తుంపర్ల సేద్యం పరికరాలను వినియోగిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పిడి జమదగ్ని, ఏపిడి వరప్రసాదరావు, ఏవో బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Body:సూక్ష్మ బిందుసేద్యం పరికరాల పై అవగాహన
Conclusion:సూక్ష్మ బిందుసేద్యం పరికరాలపై అవగాహన