చిత్తూరు జిల్లా పాకాల మండలం గొల్లపల్లిలో ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామానికి చెందిన చిన్నస్వామి కుమారుడు గుణశేఖర్ అలియాస్ విక్రమ్ సిద్ధార్థ్ చౌదరిగా పేరు మార్చుకుని ఓ అమ్మాయిని మోసం చేశాడు.
ఆమె నుంచి రూ. 10 లక్షలు తీసుకున్నాడు. మోసపోయానని గ్రహించిన యువతి... పోలీసులకు ఫిర్యాదు చేసింది. క్రిష్ణాపురం క్రాస్ వద్ద పోలీసులు అతన్ని అరెస్టు చేసి.. అతని నుంచి 5 లక్షల నగదు.. ద్విచక్రవాహనం, బంగారు అభరణాలు, రెండు నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు.
అతన్ని పట్టుకున్న సిబ్బందికి ఉన్నతాధికారులు రివార్డును అందించారు.
ఇదీ చూడండి: