చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పరిధిలో... అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి బాలకృష్ణ అనే వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సదుం మండలానికి చెందిన బాలకృష్ణ.. తన భార్య, తమ్ముడితో కలిసి కొట్రకోన అడవి సమీపంలో మామిడి తోటకు కాపలాగా ఉంటున్నారు.
అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు ప్రమాదవశాత్తూ తగిలి బాలకృష్ణ అక్కడికక్కడే మృతిచెందాడు. అతని భార్య, తమ్ముడు గాయాలపాలయ్యారు. ప్రస్తుతం వారిద్దరూ చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
ఇదీ చదవండి:
'తెదేపా మద్దతుదారుల నామినేషన్లు అడ్డుకునేందుకే దాడికి దిగారు'