ETV Bharat / state

రెండు దశాబ్దాలుగా రోడ్డులేని గ్రామాలు.. రోడ్డు కోసం రోడ్డెక్కిన ప్రజలు

Dharna for Roads: ఎంత మంది పాలకులు వచ్చినా.. అనేకసార్లు నాయకులకు మొర పెట్టుకున్నా వారి గ్రామాలకు రోడ్లు వేసే వారే కరువయ్యారు. ఇక వారి ఓపిక నశించి.. రోడ్డు కోసం రోడ్డెక్కారు. రెండు దశాబ్దాలుగా తమ గ్రామాలకు రోడ్లు వేసే నాథుడే లేడని వాపోయారు. చిన్నా పెద్దా అంతా కలసి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఆరు గ్రామాల ప్రజలు ఈ నిరసనల్లో పాల్గొన్నారు.

dharna
రోడ్డు కోసం ధర్నా
author img

By

Published : Dec 30, 2022, 7:53 PM IST

Dharna for Roads: తమ గ్రామాలకు రోడ్డు వేయాలంటూ పెద్ద పంజాని మండలం చెలమంగలం పంచాయతీ గ్రామస్థులు రోడ్డెక్కారు. సుమారు 6 గ్రామాలకు చెందిన ప్రజలు తమ రోడ్ల దుస్థితి మార్చాలంటూ బ్యానర్ పట్టుకుని మండల కేంద్రమైన పెద్ద పంజానికి చేరుకుని రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ చెలమంగలం పంచాయతీలోని తమ గ్రామాలకు దశాబ్దాల నుండి రోడ్లు లేవని.. వర్షాలు పడితే తమ గ్రామాలకు పాల ఆటోలు సైతం రావని, పిల్లలు స్కూలుకు వెళ్లలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతమంది పాలకులు, నాయకులకు మొర పెట్టుకున్నా సమస్య పరిష్కరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్య పరిష్కరించే వరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదని రోడ్డుపై బైఠాయించారు. ఎంపీడీఓ విశ్వనాథ్ మాట్లాడుతూ రెండున్నర కోట్ల రూపాయలతో రోడ్డు మంజూరైందని, అతి త్వరలోనే రోడ్డు పనులు ప్రారంభిస్తామని గ్రామస్తులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.

రోడ్డు వేయాలంటూ ధర్నా చేస్తున్న ప్రజలు

"మా భవిష్యత్తు మారాలంటే మాకు రోడ్లు కావాలి. మేము స్కూల్​కు వెళ్లాలంటే కష్టంగా ఉంది. దయచేసి మీరు మాకు రోడ్లు వేపించండి". - స్కూల్ పిల్లలు

"స్కూల్ వ్యాన్​లు కూడా గ్రామంలోకి రావడం లేదు. సైకిల్​పై వెళ్లే వారు దారి సరిగా లేకపోవడం వలన పడిపోతున్నారు. పిల్లలు చదువుకోడానికి అవ్వట్లేదు. ఈ గ్రామాలకు చెందిన విద్యార్థులు.. ఎన్ని రోజులు స్కూల్​కు వెళ్లలేదో చూడండి. దీనికి ప్రధాన కారణం రోడ్లు సరిగ్గా లేకపోవడం. ప్రభుత్వానికి చెందిన 108 వాహనం కూడా మా గ్రామానికి రాలేని దుస్థితి నెలకొంది. పాల వ్యాన్ కూడా రావడం లేదు. పాలు కూడా అమ్ముకోలేక పోతున్నాం. ఎవ్వరూ కూడా గ్రామంలోకి రావడం లేదు". - గ్రామస్తుడు

"రెండు కోట్ల ఏబై లక్షలతో రోడ్డు మంజూరు అయింది. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. కొన్ని సాంకేతిక కారణాల వలన, కాంట్రాక్టర్ల సమస్య వలన ఇంకా పనులు మొదలుకాలేదు. కానీ ఆ సమస్యలను అధిగమించి త్వరలోనే పనిని ప్రారంభించబోతున్నాం". - ఎంపీడీఓ విశ్వనాథ్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.