సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని శేషాపురం, పనపాకం, కుర్రచెను కాలవ గ్రామాల్లో పశువుల పండగ నిర్వహించారు. పశువులకు కట్టిన పలకలను చేజిక్కించుకోవడానికి యువకులు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. చిన్నపాటి గాయాలు మినహా ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బంది కలగకపోవడంపై నిర్వాహుకులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీ చదవండి: