అంగన్వాడీల్లో బాలింతలు, చిన్నారులకు పౌష్ఠికాహారం అందించేందుకు రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ సమాయత్తమైంది. జెడ్పీఎన్ఎఫ్తో కలిసి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రొత్సహిస్తోంది. రసాయన ఎరువులు క్రిమిసంహారక మందులు వినియోగించకుండా పంటలు పండించి అంగన్వాడీల్లో వినియోగిస్తున్నారు. ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని 300 అంగన్వాడీ కేంద్రాల్లో న్యూట్రి గార్డెన్స్, కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు చేసి పంటలు వండిస్తున్నారు.
ఏడు రకాల ఆకుకూరలు, కూరగాయలు, నాలుగు రకాల తీగజాతి కూరగాయలు, ఆయుర్వేద పుదీనా, తులసి, జింజర్, అలోవేరా, అరటి, దానిమ్మ, బొప్పాయి వంటి పలు రకాల పంటలను ప్రకృతి పద్ధతిలో సేంద్రియ ఎరువులు, కషాయాలు, ద్రవ-ఘన జీవామృతం వినియోగించి పండిస్తున్నారు. ఆరోగ్యవంతమైన పౌష్టికాహారాన్ని గర్భిణులు బాలింతలు చిన్నారులకు అందించే ఏర్పాట్లు చేపట్టారు. అంగన్వాడీ కేంద్రాల ఆవరణలో ఖాళీగా ఉన్న ప్రదేశం, గ్రామాల్లో రైతుల వద్ద కౌలుకు తీసుకున్న భూమిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు.
ఇదీచదవండి
బంగాళాఖాతంలో స్థిరంగా వాయుగుండం...రేపటి నుంచి వర్షాలు పడే అవకాశం