ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా చిత్తూరు జిల్లా కలవగుంటలో పోలీసులు తనిఖీలు చేశారు. గ్రామంలోని కర్మాగారంలో పనిచేసే నలుగురు పిల్లలను వారి ఇళ్లకు పంపించేశారు. బాలబాలికలను కార్మికులుగా నియమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సెంథిల్ కుమార్ అన్నారు. బాలలను పనిలో పెడితే తల్లిదండ్రులు నేరస్థులవుతారని చెప్పారు. బడిఈడు పిల్లలను పనిలో నియమించుకున్నందుకు యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని ఎస్పీ ఆదేశించారు.
ఇదీ చదవండి:
గుడివాడలో ఆపరేషన్ ముస్కాన్..28మంది బాలకార్మికుల గుర్తింపు