తిరుపతి సహా నగర శివారు ప్రాంతాల్లో ఆపరేషన్ ముస్కాన్ సమర్థవంతంగా నిర్వహించినట్లు... తిరుపతి అర్బన్ ఏఎస్పీ అనిల్ బాబు తెలిపారు. రైల్వే స్టేషన్, బస్టాండ్, దేవాలయాల పరిసరాల్లో భిక్షాటన చేస్తూ... రోడ్లపై తిరుగుతున్న 50 మంది బాలబాలికలను గుర్తించినట్లు వివరించారు. వారందర్నీ తిరుపతి అర్బన్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి... వివరాలు సేకరించామన్నారు. వారినుంచి సేకరించిన వివరాల ప్రకారం... 44 మంది బాలల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి... పిల్లలను అప్పగించినట్లు తెలిపారు. తల్లిదండ్రులు లేని మిగిలిన ఆరుగుర్ని జిల్లా బాలల సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: హంద్రీనీవా రాకతో... పెద్దతిప్ప సముద్రంలో సంబరాలు