ETV Bharat / state

కళ్యాణిడ్యామ్ పోలీసు ట్రైనింగ్​ కాలేజ్​లో.. వర్చువల్​ శిక్షణ

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని కళ్యాణిడ్యామ్ పోలీసు ట్రైనింగ్​ కాలేజ్​లో ఉన్న ట్రైనీలకు.. వర్చువల్ విధానంలో తరగతులు ప్రారంభమయ్యాయి. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్​తో పాటు 45 మంది ఎక్సైజ్ ఎస్సైలు శిక్షణ పొందుతున్నారని ప్రిన్సిపల్ అశోక్ బాబు తెలిపారు.

virtual training classes
వర్చువల్​ శిక్షణా తరగతులు
author img

By

Published : May 11, 2021, 9:49 PM IST

కరోనా విజృంభిస్తున్న వేళ శిక్షణకు అంతరాయం కలగకుండా ట్రైనీల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తున్నట్లు కళ్యాణిడ్యామ్ పోలీసు ట్రైనింగ్​ కాలేజీ ప్రిన్సిపల్ అశోక్ బాబు తెలిపారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కళ్యాణిడ్యామ్ పోలీసు ట్రైనింగ్​ కాలేజ్​లో.. ట్రైనీలకు నేటి నుంచి వర్చువల్ విధానంలో తరగతులు ప్రారంభించినట్లు ప్రిన్సిపల్ చెప్పారు. డీజీపీ గౌతం సవాంగ్, అదనపు డీజీపీ సంజయ్​ల ఆదేశాలతో ఎక్సైజ్ శాఖ సమన్వయంతో శిక్షణ తరగతులు మొదలు పెట్టామన్నారు.

వాటిని విజయవంతంగా కొనసాగిస్తామని పేర్కొన్నారు. అనంతపురం, విజయనగరం, ఒంగోలులో శిక్షణ కేంద్రాలు ఉండగా.. కేవలం కళ్యాణిడ్యామ్ ట్రైనింగ్ సెంటర్​లో మాత్రమే ఈ వర్చువల్ తరగతులను ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. శిక్షణకు ఎలాంటి అంతరాయం కలగకూడదనే ఉద్దేశ్యంతో కొవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూ తరగతులు నిర్వహిస్తున్న తీరు పట్ల శిక్షణ పొందేవారు, భోదనా సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

గిన్నిస్ రికార్డు​ సాధించిన ఫజీలాకు ఎమ్మెల్యే సత్కారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.