చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రామాపురం తండాలో ఉద్రిక్తత నెలకొంది. వైకాపా వర్గీయుల మధ్య నిన్న జరిగిన ఘర్షణలోని ఓ వ్యక్తి.. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. 9వ తేదీన ఉపాధిహామీ పనుల విషయంలో వైకాపా వర్గీయుల మధ్య వివాదం తలెత్తింది. యంత్రాలతో ఉపాధి హామీ పనులు చేయిస్తుండడాన్ని వెంకటేష్ నాయక్ అనే వ్యక్తి మొబైల్లో చిత్రీకరించాడు. ఈ విషయం గమనించిన చక్రవర్తి నాయక్ ... అతనిపై దాడి చేశాడు. ఈ ఘటనలో వెంకటేష్‌కు తీవ్ర గాయాలుకాగా .. అతనిని కుప్పం ఆసుపత్రికి తరలించారు. బాధితుడు చికిత్సపొందుతూ.. ఈ రోజు మృతిచెందాడు. ఉపాధి హామీ పనుల్లో జరిగిన వివాదమే..ఈ హత్యకు దారితీసిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-0.ఇదీచూడండి. పెళ్లింట విషాదం...విద్యుత్ షాక్‌తో వధువు అన్నయ్య మృతి