చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు ఐసీడీఎస్ అధికారులు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. లాక్డౌన్ ప్రభావంతో వీరు ఇంటికే పరిమితమైనందున ఈనెల 15 నుంచి మే 3 వరకు గుడ్లు, పాలు, బియ్యం, నూనె తదితర వస్తువులను లబ్ధిదారుల ఇంటికే అందిస్తామని అధికారులు తెలిపారు. 3 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలకు ఒక్కొక్కరికి 15 గుడ్లు, రెండు కిలోల బియ్యం, 400 గ్రాముల పప్పు, తల్లులకు 30 గుడ్లు, 250 మిల్లీలీటర్ల నూనె, 3 లీటర్ల పాలు, రెండు కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నామని స్థానిక సీడీపీఓ సుజాత తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమై లాక్డౌన్కు సహకరించాలని కోరారు.
ఇదీ చదవండి..