చిత్తూరు జిల్లా గాంధీ విగ్రహ కూడలిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని నగరపాలక అధికారులు తొలగించారు. గతంలో పీసీఆర్ కూడలిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించి, గాంధీ విగ్రహం పక్కనే ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ సొంత ట్రస్టు ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అయితే, కొత్తగా ఏర్పాటు చేసిన విగ్రహానికి జిల్లా కలెక్టర్ అనుమతి లేదంటూ అర్ధరాత్రి నగరపాలక, పోలీస్ అధికారులు క్రేన్ సాయంతో ఎన్టీఆర్ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహాన్ని తెదేపా జిల్లా కార్యాలయానికి తరలించారు.
ఇదీ చదవండి: ఆకలి పోరాటాన్ని క్రికెట్‌తో జయించిన యశస్వి