చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోట మండలం బడికాయలపల్లికి చెందిన కుమార్.. రెండు కిడ్నీలు దెబ్బతిని ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఈ విషయాన్ని వైకాపా సోషల్ మీడియా సభ్యులు వెలుగులోకి తెచ్చి.. విరివిగా విరాళాలు పోగు చేసి ఆదుకుంటున్నారు. విషయాన్ని తెలుసుకున్న అమెరికా ఎన్నారై వైద్యులు పంచ్ ప్రభాకర్‌రెడ్డి, వాసుదేవ రెడ్డి, కల్లూరి వెంకట్లు ఏకాంగా రూ 1.53 లక్షలు బాధితునికి అందజేసి ఆదుకున్నారు. దీంతో బాధితుని తల్లిదండ్రులు వైకాపా సోషల్ మీడియా బృందం సభ్యులు, కన్నె మడుగు దాతలు రామకృష్ణారెడ్డి, రవి శంకర్ రెడ్డి, నియోజకవర్గం వైకాపా కార్యకర్తలు, ప్రజలు, అధికారులు ఎన్.ఆర్ఐ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చూడండి...: మూడు రోజుల క్రితం గల్లంతు.. చెరువులో తేలిన మృతదేహం