తిరుపతి నుంచి హుబ్బల్లి, కలబురగి విమానాశ్రయాలకు స్టార్ ఎయిర్‌లైన్స్ నూతన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. కలబురగి నుంచి తిరుపతి విమానాశ్రయానికి ఉదయం 11 గంటలకు చేరుకునే విమానం 11.25 గంటలకు హుబ్బల్లి బయలుదేరి వెళ్తుంది.
తిరిగి హుబ్బల్లి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతి చేరుకుని 2.25 గంటలకు కలబురగికి వెళ్లనున్నట్లు పేర్కొంది. సోమవారం నుంచి ఈ సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
ఇదీ చదవండి: