మద్యపాన నిషేధం పేరుతో సీఎం జగన్ రూ.25 వేల కోట్ల దోపిడీకి తెర లేపారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. నిషేధం పేరుతో జరుగుతున్న నిషా దందాను బయటపెట్టినందుకు ఎస్సీ యువకుడు ఓం ప్రతాప్ చావుకు కారణమయ్యారని విమర్శించారు. స్వయంగా జిల్లా మంత్రి, ఎంపీ ఈ హత్య వెనుక ఉన్నారని లోకేశ్ అన్నారు. వాస్తవాలు బయటకు రానివ్వకుండా కనీసం కేసు కూడా నమోదు చెయ్యలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెదేపా నాయకుల ఓం ప్రతాప్ గ్రామానికి వెళ్లకుండా ఎందుకు గృహ నిర్భంధం చేస్తున్నారని నిలదీశారు. పోస్ట్మార్టం జరుగుతున్నప్పుడు ఎంపీ పక్క ఊరిలో ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. ఓం ప్రతాప్ మరణంపై న్యాయ విచారణ జరగాలని లోకేశ్ డిమాండ్ చేశారు. ఎస్సీలు రాష్ట్రంలో స్వేచ్ఛగా జీవించే వాతావరణం కల్పించాలని లోకేశ్ హితవు పలికారు.
![nara lokesh on om prathap death](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8590160_656_8590160_1598607398376.png)
ఇదీ చదవండి: మాజీమంత్రి అచ్చెన్నాయుడికి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు