చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే, ఏపీఐసీసీ ఛైర్ పర్సన్ మాజీ మంత్రి రెడ్డివారి చెంగారెడ్డిని కలిశారు. హైదరాబాద్లోని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. నియోజకవర్గంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీరి కలయిక చర్చనీయాంశమైంది. నియోజకవర్గ రాజకీయ స్థితిగతులపై ఆయనతో మాట్లాడినట్టు తెలుస్తోంది. రెడ్డివారి చెంగారెడ్డి కుమార్తె ఇందిరా ప్రియదర్శిని సమావేశంలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి:
అమెరికాలో తెలుగు వికాసం దిశగా.. వేల్చేరు చొరవ అభినందనీయం: ఉపరాష్ట్రపతి