చిత్తూరు జిల్లా నగరి ప్రజల ఇబ్బందులను చూసి వారికి చేయాలని భావించానని ఎమ్మెల్యే రోజా అన్నారు. జిల్లాలో పరిశ్రమల అనుమతులు గురించి జిల్లా పాలనాధికారి భరత్ గుప్తాతో రోజా చర్చించారు. అన్ని శాఖల సమన్వయంతో జిల్లాలో కరోనా కట్టడి సాధ్యమైందని తెలిపారు.
అంతా సర్దుకుంటుందనుకున్న సమయంలో... చెన్నై కోయంబేడు మార్కెట్కు వెళ్లినవారికి కరోనా పాజిటివ్ రావడంతో జిల్లా యంత్రాంగం ఉలిక్కిపడిందన్నారు. జిల్లా నుండి ఏయే ప్రాంతాలవారు ఈ మార్కెట్కు వెళ్లారు... వారు ఎవరా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారన్నారు. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని రోజా ఆశాభావం వ్యక్తం చేశారు.