చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా పురపాలక ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డులో హిక్స్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైకాపాకు పట్టం కట్టారని.. పుర, నగర పాలక ఎన్నికల్లోనూ తమ పార్టీని ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
వెన్నుపోటుదారులను వైకాపా అధిష్ఠానం గుర్తించాలి: రోజా
చిత్తూరు జిల్లా నగరి, పుత్తూరు పురపాలక ఎన్నికల వైకాపా రెబెల్ అభ్యర్థులపై ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలలో వైకాపా ఓటమికి కొందరు నేతలు పనిచేశారన్న రోజా... తెదేపా గెలిచినా ఫర్వాలేదని 14 మంది రెబల్స్‌ను నగరి, పుత్తూరులో బరిలోకి దింపారన్నారు. రెబల్స్ గెలవడానికి పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేశారన్నారు. గత ఎన్నికల్లో తన ఓటమి కోసం పనిచేసిన వారు మళ్ళీ బరిలోకి దిగారన్న రోజా... నగరి, పుత్తూరులో వైకాపా గెలవకూడదని కుట్రలు పన్నారన్నారు. వెన్నుపోటు దారులను వైకాపా అధిష్ఠానం గుర్తించాలని విజ్ఞప్తి చేసిన ఆమె..అన్నీ కుట్రలు ఛేదించి నగరి, పుత్తూరులో తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:
ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దంపతులు