MOTHER SON DIED: నీటిలో మునిగిపోతున్న తనయుడిని కాపాడబోయి అతనితో పాటు తల్లి కూడా మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా గుడిపాల మండలం చిత్తపారలో ఆదివారం జరిగింది. స్థానికురాలైన కవిత (35) తన మతిస్థిమితం లేని కొడుకు డిల్లీ(15) తీసుకుని దుస్తులు ఉతికేందుకు ఇంటికి సమీపంలోని అప్పాయగుంటకు వెళ్లింది. ప్రమాదవశాత్తు కుమారుడు కాలు జారీ నీటిలో పడిపోగా కాపాడేందుకు ఆమె చెరువులోకి దిగింది. అతడు తల్లిని గట్టిగా పట్టుకోవటంతో ఇద్దరు నీటిలో మునిగిపోయారు. ఇంటి నుంచి వెళ్లిన ఇద్దరూ ఎంతసేపటికీ తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ దుస్తులు ఉండటం, వారు కనిపించకపోవటంతో అనుమానంతో చెరువులో వెతకగా మృతదేహలు దొరికాయి. దీనిపై గుడిపాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: