ETV Bharat / state

'విచారణ చేసే అరెస్ట్ చేశారు... కావాలని చేయలేదు' - mla roja comments on ycp

అవినీతి చేసి...పేద ప్రజల జీవితాలతో చెలగాటమాడారు కాబట్టే అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డిలు అరెస్ట్ అయ్యారని ఎమ్మెల్యే రోజా అన్నారు. సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేశాం కానీ...కావాలని చేసింది కాదని రోజా అన్నారు.

mla roja
కియోస్క్​ను ప్రారంభిస్తున్న నగరి ఎమ్మెల్యే రోజా
author img

By

Published : Jun 14, 2020, 7:16 PM IST

చిత్తూరు జిల్లా పుత్తూరు వైద్య విధాన పరిషత్ ఆస్పత్రిలో సత్యవేడు శ్రీ సిటీ ఆధ్వర్యంలో కోవిడ్ పరీక్షల కోసం ఏర్పాటు చేసిన కియోస్క్​ను నగరి ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. రాష్ట్రంలో పాలన నియంత్రణకు ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మహారాష్ట్ర, చెన్నై, కర్ణాటక నుంచి వస్తున్న వారి కారణంగానే ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయని రోజా తెలిపారు.

కక్షగట్టి చేయలేదు..

అవినీతికి పాల్పడ్డారు కాబట్టే అచ్చెన్నను, జేసీ ప్రభాకర్ రెడ్డిను అరెస్టు చేశారని...దీనిని చంద్రబాబు రాద్ధాంతం చేయటం తగదన్నారు రోజా. సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేశాం కానీ...కక్ష పూరితంగా చేయలేదన్నారు. మీరు తప్పు చేయకపోతే కోర్టుకు వెళ్లండని...అంతేకానీ రోడ్ల పైకి వచ్చే నిరసనలు చేస్తే ఉపక్షేంచేది లేదని రోజా హెచ్చరించారు.

ఇవీ చదవండి: 'వైకాపా కండువా కప్పుకుంటే కోట్లు... లేదంటే కేసులు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.