గ్రామ వాలంటరీ, గ్రామ సచివాలయ వ్యవస్థల ద్వారా అన్ని రకాల సేవలను ప్రజల వద్దకే తీసుకెళ్తున్నట్లు చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి పేర్కొన్నారు. కురబలకోట మండల పర్యటనలో భాగంగా... ముదివేడు గ్రామ నూతన సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. ఈ వ్యవస్థలను ప్రధాని మోడీ కూడా ప్రశంసించారని గుర్తుచేశారు.
గత ప్రభుత్వం హయాంలో ప్రజలు సమస్యల పరిష్కారం కోసం మండల కేంద్రాల్లో అవస్థలు పడేవారని... ప్రస్తుతం గ్రామ సచివాలయాలు అందుబాటులో ఉండటం వల్ల ఆ భాద లేదన్నారు. అనంతరం కుల అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సచివాలయాల ఉద్యోగులు, వైకాపా కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
ఇదీ చూడండి: