చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో 50 వేల కుటుంబాలకు... ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఉచితంగా అరటి పండ్లను పంపిణీ చేశారు. లాక్డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన ప్రజలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వైకాపా కార్యకర్తలు, మండలాల ఎంపీడీవోల ఆధ్వర్యంలో గ్రామ వాలంటీర్ల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ, అరటి పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టినట్లు తెలిపారు. ఎవ్వరు లాక్ డౌన్‌ను ఉల్లంఘించవద్దని ఎమ్మెల్యే కోరారు.
ఇదీ చదవండి: