తిరుమల శ్రీవారిని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న వారికి తితిదే ఆధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.
రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. తితిదే నుంచి సీతారాముల విగ్రహాలను రామతీర్థానికి తరలించామని.. బాలాలయం ఏర్పాటు చేసి విగ్రహ ప్రతిష్ఠిస్తామని మంత్రి తెలిపారు.
ఇదీ చదవండి: