కలియుగ దైవం శ్రీనివాసుని మాతృమూర్తి అయిన వకుళమాత ఆలయం శిథిలావస్థకు చేరుకున్నందున పునర్నిర్మాణం చేపడుతున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పేరూరు బండపై నిర్మిస్తున్న ఆలయ పనులను ఆయన పరిశీలించారు. గుడికి వచ్చే భక్తులు ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం చేసుకునే విధంగా నిర్మాణం జరుగుతోందని అన్నారు. వచ్చే ఏడాది మార్చి వరకు ఆలయ నిర్మాణం పూర్తిచేసి ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు.
ఇవీ చదవండి..