చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం హీరో పరిశ్రమలో పనిచేస్తున్న వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపిస్తున్నారు. వీటికోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసి జిల్లా కేంద్రాలకు తరలించారు. ఇందులో బీహర్, యూపీ, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల కార్మికులు అత్యధికాంగా ఉన్నారు.
735 కార్మికుల్లో బీహర్‌కు చెందిన 303 కార్మికులను అధికారులు వారి స్వస్థలాలకు తరలించారు. రెండో విడతలో మిగిలిన వారిని పంపిస్తామని తెలిపారు. ముందుగా చిత్తూరు, తిరుపతి ప్రాంతాలకు తరలించి అక్కడి నుంచి ప్రత్యేక రైళ్లలో వారి స్వస్థలాలకు పంపిస్తారు.
ఇవీ చదవండి: సైన్యం కీలక విజయం- హిజ్బుల్ సారథి హతం