ETV Bharat / state

తారకరత్న ఆరోగ్యంపై స్పందించిన మంచు మనోజ్.. ఏమన్నారంటే..!

Manchu Manoj: హీరో మంచు మనోజ్ బెంగళూరులో తారకరత్న చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడారు. తారకరత్న ఆరోగ్య వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిపై మంచు మనోజ్ మీడియాతో మాట్లాడారు.

Manchu Manoj
హీరో మంచు మనోజ్
author img

By

Published : Jan 29, 2023, 8:47 PM IST

Updated : Jan 30, 2023, 8:34 AM IST

Manchu Manoj About Tarakaratna Health Condition: నటుడు తారకరత్న ఆరోగ్య పరిస్థిపై ఉత్కంఠ నెలకొన్న సమయంలో సినీ, రాజకీయ ప్రముఖలు ఉదయం నుంచి ఆయన చికిత్స తీసుకుంటున్న బెంగళూరులోని హృదయాలయ ఆసుపత్రికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం తారకరత్న కుటుంబ సభ్యులు, బంధువులు ఆయనను చూసేందుకు రాగా.. సాయంత్రం హీరో మంచు మనోజ్ తారకరత్న చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వచ్చారు. ఆయన కుటుంబసభ్యులను కలుసుకున్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న తారకరత్నను చూసినట్లు వెల్లడించారు. తారకరత్న క్రమంగా కోలుకుంటున్నారని మంచు మనోజ్‌ పేర్కొన్నారు. కోలుకుంటున్న తీరుపై వైద్యులు సంతృప్తిగా ఉన్నారని ఆయన తెలిపారు.

హీరో మంచు మనోజ్

'తారకరత్న ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.. ఆయనను చూశా. ఆయన త్వరలో కోలుకోవాలని కోరుకుంటున్నాను. తను ఓ ఫైటర్... తారకరత్న త్వరలో మన ముందుకు వస్తాడు. ఆయనను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఆసుపత్రి వైద్యులు ఆయనకు అందించే వైద్యం పట్ల సంతృప్తిగా ఉన్నారు.' -మంచు మనోజ్

బెంగళూరులోని నారాయణ హృదయాలయ వైద్యశాలలో చికిత్స పొందుతున్న తారకరత్నను ఈ రోజు ఉదంయం నుంచి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, వసుంధర, బ్రాహ్మణి చూశారు. కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్​ ఆసుపత్రికి వచ్చి తారకరత్నకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు.

యువగళం పాదయాత్రలో శుక్రవారం అస్వస్థతకు గురైన తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు. శనివారం వేకువజామున కుప్పం నుంచి బెంగుళూరుకు తీసుకువచ్చి ప్రత్యేక వైద్య బృందంతో అత్యున్నత చికిత్సను అందిస్తున్నారు. తారకరత్నను చూసేందుకు ఈరోజు ఉదయం జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, నారా బ్రాహ్మణి, వసుంధర, కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సుధాకర్​తో పాటు కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ఆసుపత్రికి వచ్చారు.

శివకుమార్​తో కలసి మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ నిన్నటికంటే ఈ రోజు తారకరత్న ఆరోగ్యం మెరుగుపడిందని తెలిపారు. తారకరత్న ఆరోగ్యం క్షీణించిన పరిస్థితుల్లో అద్భుతం జరిగిందని చెప్పారు. వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారని.. వైద్య సేవలకు తారకరత్న స్పందిస్తున్నారని వివరించారు. దేవుడి కృపతో, అభిమానుల ప్రార్ధనతో తారకరత్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 30, 2023, 8:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.