ETV Bharat / state

LIVE SUICIDE: ఫేస్​బుక్​ లైవ్​లో వ్యక్తి ఆత్మహత్య...ఎందుకంటే..! - man suicide in face book live news

ఫేస్ బుక్ లైవ్​లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. తన భార్య, అత్త, ఆమె కుమార్తెలు పెడుతున్న వేధింపులు తట్టుకోలేకే సూసైడ్ చేసుకుంటున్నట్లు వీడియోలో పేర్కొన్నాడు.

man suicide in face book live
man suicide in face book live
author img

By

Published : Sep 28, 2021, 12:14 PM IST

భార్య, అత్త, ఆమె కుమార్తెల వేధింపులు భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో చోటు చేసుకుంది. ఫేస్​బుక్​ లైవ్​లో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

గుంటూరుకు చెందిన శంకరనారాయణ కుమారుడు ఉదయ్ భాస్కర్ కొంతకాలం క్రితం మదనపల్లెకు వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు. మదనపల్లెకు చెందిన సోనీతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఉదయ్ భాస్కర్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మేనేజర్‌గా పని చేస్తున్నారు. తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఆదివారం రాత్రి ఉదయ్ భాస్కర్ భార్య సోనీ పుట్టింటికి వెళ్లింది. తన భార్య, ఆమె కుటుంబ సభ్యులు పెడుతున్న ఇబ్బందులు తట్టుకోలేక చనిపోతున్నట్లు చెప్పాడు. ఫేస్​బుక్​లో ఈ విషయాన్ని గుర్తించిన కొంతమంది స్నేహితులు బాధితుడి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకునేలోపే అతను మృతి చెందాడు.

మద్యానికి బానిసై ఉదయ్ భాస్కర్ తరచూ వేధింపులకు గురి చేసేవాడని.. పలుమార్లు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశానని.. ఆదివారం కూడా గొడవ పెట్టుకొని కొట్టడంతో తాను పుట్టింటికి వెళ్లినట్లు మృతుడి భార్య సోనీ పోలీసులకు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

face book live suicide: ఫేస్‌ బుక్‌లైవ్‌ వీడియో పెట్టి ఆత్మహత్య

ఇదీ చదవండి: Lovers Suicide in Gadwal at Telangana : రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.