చిత్తూరు జిల్లాలో కరోనా పెరుగుతున్నందున తిరుపతిలో లాక్‌డౌన్‌ను ఈ నెల 31వరకూ పొడిగిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పీఎస్ గిరీషా ప్రకటించారు. దుకాణాల నిర్వహణ సమయాల్లో సడలింపులు చేశారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటలవరకు దుకాణాలను నిర్వహించుకోవచ్చనని ఆయన అన్నారు. జిల్లాలో ఆదివారం 981 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకూ నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 23వేల459కి చేరుకుంది. ఆదివారం కరోనాతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 235కి చేరింది. జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో ఇప్పటివరకు 14093 మంది కరోనా మహమ్మారి నుంచి కొలుకోగా... 9131 యాక్టివ్ కేసులకు జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చూడండి. పబ్జీ ఆడేందుకు ఫోన్ ఇవ్వలేదని బ్లేడ్‌తో గొంతు కోసుకున్న బాలుడు