చిత్తూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసు నమోదుపై అధికారులు, ప్రజా ప్రతినిధులు అప్రమత్తమయ్యారు. పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెడుతున్నారు. కరోనా వైరస్ అరికట్టేలా దేశమంతా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రజలెవరూ రోడ్లపైకి రాకుండా నివాసాలకే పరిమితం కావాలని సూచించారు. అత్యవసర సేవల వాహనాలు, వైద్య సిబ్బంది మినహా మరెవరూ రహదారులపైకి రాకుండా అడ్డుకుంటున్నారు. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. పనిలేకుండా బయటికి వచ్చినా వారిపై కఠిన చర్యలను తీసుకోవాలని పోలీసులకు సూచించారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రావొద్దంటూ ప్రజలను కోరారు.
ఇదీ చూడండి: