చిత్తూరు జిల్లా అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు. జూన్ 19 నుంచి స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో..ఆలయంలో ఏకాంతంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేశారు.
అనంతరం నామకోపు, శ్రీచూర్ణంతో పాటు పలు సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణ కోసం ఏర్పాట్లను ఘనంగా చేయాలని ఇప్పటికే తితిదే ఆదేశాలు జారీ చేసింది.
ఇదీచదవండి