నీటి వనరులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. తిరుపతి సమీపంలోని అవిలాల చెరువులో తితిదే నిర్మిస్తున్న శ్రీ వేంకటేశ్వర ఆధ్యాత్మిక వైభవ ఉద్యానవన పనులను ఆయన పరిశీలించారు. ధర్మపరిరక్షణకు వినియోగించాల్సిన తితిదే నిధులను ఇతర కార్యక్రమాలకు వినియోగిస్తున్నారని ఆరోపించారు. తిరుపతిలో నీటి ఎద్దడి నివారణకు అవిలాల చెరువులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని కన్నా అభిప్రాయపడ్డారు. పర్యావరణ పరిరక్షణలో సుప్రీం కోర్టు ఆదేశాలను అవిలాల చెరువులోనూ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి.. సమావేశాల పొడగింపునకు ప్రభుత్వం యోచన!