ETV Bharat / state

కరోనా భయం.. వైన్​షాప్​ ఎదుట గ్రామస్థుల ఆందోళన - corona virus latest news

చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం కమ్మపల్లి గ్రామంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలో 20 కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండంతో గ్రామ సమీపంలోని మద్యం దుకాణాన్ని మూసివేయాలని గ్రామస్థులు ఆందోళన చేపట్టారు.

వైన్​షాప్​ ఎదుట గ్రామస్థుల ఆందోళన
వైన్​షాప్​ ఎదుట గ్రామస్థుల ఆందోళన
author img

By

Published : Mar 16, 2021, 6:34 PM IST

చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం కమ్మపల్లి గ్రామంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. కమ్మపల్లిలో గడిచిన రెండు రోజుల్లో 20కి పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు కూడా అప్రమత్తమై గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్​గా ప్రకటించారు.

అయితే గ్రామ సమీపంలో మద్యం దుకాణం ఉండటంతో మందు బాబులు బారులు తీరుతున్నారని.. వైరస్ మరింత విస్తరించే అవకాశం ఉందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే మద్యం దుకాణాన్ని మూసివేయాలని ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్థులతో చర్చించారు. ఉన్నతాధికారుల సూచనలతో తాత్కాలికంగా మద్యం దుకాణాన్ని మూసివేసేలా ప్రయత్నిస్తామని తెలపడంతో గ్రామస్థులు శాంతించారు.

ఇదీ చదవండి:

శేషాచలం అడవుల్లో మంటలు.. పట్టించుకోని అధికారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.