తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో పురోహితులు కాలభైరవ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇప్పటికే వినాయక, సుబ్రమణ్య, నవగ్రహ హోమాలు పూర్తి చేశారు. కార్తిక మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్న తితిదే అధికారులు ఇవాళ కాలభైరవ హోమం, పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహా శాంతి అభిషేకం, కలశాభిషేకాలను నిర్వహించారు. రేపు ఆలయంలో దక్షిణామూర్తి హోమం చేయనున్నారు.
ఇదీ చదవండి: