తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా తెలంగాణకు చెందిన జూపల్లి రామేశ్వర్రావు ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత రామేశ్వర్రావుతో అదనపు ఈవో ధర్మారెడ్డి ప్రమాణం చేయించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని.. రంగనాయకుల మండపానికి చేరుకున్న బోర్డు సభ్యునికి పండితులు వేదాశీర్వచనం పలికారు. అనంతరం శేషవస్త్రంతో సత్కరించి.. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఇదీ చదవండి: ttd: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి వాహన సేవలు