ETV Bharat / state

ప్రత్యేక దర్శనం ఆన్​లైన్ కోటా విడుదల - ttd latest news

శ్రీవారి దర్శనంకు సంబంధించి ప్రత్యేక దర్శనం జూన్ నెల కోటాను తితిదే విడుదల చేసింది. దర్శనంతో పాటు గదులు బుక్​ చేసుకునే వెసులుబాటు కల్పించింది.

special entry darshan online tickets released by ttd
జూన్ నెల ఆన్​లైన్ కోటా విడుదల
author img

By

Published : Jun 9, 2020, 11:53 AM IST

తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం(ఎస్ఈడీ) జూన్ నెల కోటాను తితిదే ఆన్​లైన్​లో విడుదల చేసింది. జూన్​లో 21వ తేదీని మినహాయించి మిగిలిన రోజులకు... రోజుకు మూడ వేల చొప్పున ప్రత్యేక ప్రవేశ దర్శనం 300 రూపాయల ఆన్​లైన్ టికెట్లను భక్తులు బుక్ ​చేసుకునే వెసులుబాటు కల్పించింది. టికెట్​తో పాటు వసతి గదులు బుక్​ చేసుకునే సదుపాయం ఉంది. ఈ నెల 10వ తేదీ నుంచి తిరుపతిలో రోజుకు మూడువేల చొప్పున సర్వదర్శనం(ఎస్ఎస్​డీ) టికెట్​లను తితిదే కౌంటర్లలో భక్తులకు అందిస్తారు. భక్తులు ఒకరోజు ముందుగా టికెట్​లు తీసుకొని మరుసటి రోజు దర్శనానికి వెళ్లాలి.

ఇదీ చదవండి: ఘనంగా శతవసంతాల పండగ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.