చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని కళ్యాణి డ్యామ్‌ను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శనివారం సందర్శించారు. నిండుకుండను తలపిస్తోన్న కళ్యాణి డ్యామ్‌లోని నీటికి జలహారతి ఇచ్చారు. అనంతరం కొంత సమయం గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలి.. మళ్ళీ గేట్లను మూసివేశారు.

ఇటీవల కురిసిన వర్షాల కారణంగా డ్యామ్‌లోకి పుష్కలంగా నీరు చేరిందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. చంద్రగిరి పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగేందుకు అవకాశం ఉందన్నారు. నీటిని అక్కడక్కడా స్టోర్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అవసరమైన సమయంలో అధికారులు గేట్లు ఎత్తేందుకు సిద్ధంగా ఉన్నారని.. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సూచించారు.


ఇదీ చదవండి: లోక్‌సభలో వైకాపా తీరు.. రైతు ద్రోహమే: చంద్రబాబు