జగనన్న విద్యాకానుక కింద చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 3,80,340 మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. అందులో బాలురు 1,86,958 మంది, బాలికలు 1,93,382 మంది. బ్యాగు, బూట్లు, మూడు జతల ఏకరూప దుస్తులు అందరికీ పంపిణీ కానున్నాయి. రాత పుస్తకాలు 2,02,82,084 ఇవ్వనున్నారు.
పంపిణీ ఇలా..
విద్యాకానుక కిట్లు ప్రతి రోజు 50 చొప్పున విద్యార్థులు, వారి తల్లులకు పంపిణీ చేయాలి. హాజరైన విద్యార్థులు, తల్లులకు శానిటైజేషన్ చేయాలి, చేతులు బాగా ఆరిన తర్వాత బయోమెట్రిక్ హాజరు తీసుకోవాలి. కార్యక్రమానికి హాజరయ్యే వారికి మూడు మాస్కులు అందజేయనున్నారని సమాచారం. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కరోనా మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యా కమిషనర్ చిన వీరభద్రుడు ఆర్‌సీ నంబరు 151ని జారీ చేశారు. పంపిణీపై అందులో స్పష్టత ఇచ్చారు. జగనన్న విద్యాకానుకను చిత్తూరు కణ్ణన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ భరత్‌గుప్తా తెలిపారు. ఎమ్మెల్యే శ్రీనివాసులు ఇతర ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు.
ఇదీ చదవండి