రాష్ట్రంలోని చాల ప్రాంతాల్లో జగనన్న కాలనీలు నీటమునిగాయి. ఒంగోలు, తిరుపతి, కాకినాడ కనిగిరి ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు పేరిట ఇళ్లు కట్టుకునేందుకు కేటాయించిన భూములన్ని నీళ్లతో నిండిపోయి..చెరువుల్లా తలపిస్తున్నాయి.
చిత్తూరు జిల్లాలో..
పాడిపేట-గాజులమండ్యం మార్గంలో సూరప్పకశం వద్ద జగనన్న కాలనీలో 1036 మంది లబ్ధిదారులకు ప్లాట్లు మంజూరు చేశారు. ఇప్పుడు ఆ స్థలాలు అన్నీ నీట మునిగాయి. ఇలాంటి చోట ఈ సమయంలో ఇల్లు కట్టుకోవడమంటే ఆర్థిక భారమే తప్ప ఉపయోగం లేదని.. పెద్ద వర్షాలు కురిస్తే ఇళ్లన్నీ మునిగిపోయే ప్రమాదం ఉందని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో..
యు.కొత్తపల్లి మండలం కొమరగిరి, కాకినాడ గ్రామీణం నేమాంలో జగనన్న కాలనీ పేరిట పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు అన్ని జలమయమయ్యాయి.
ప్రకాశం జిల్లాలో..
గిద్దలూరులో సగిలేరు వాగు ఒడ్డునే జగనన్న కాలనీ లేఅవుట్ వేశారు. ఇప్పుడు వాగు ప్రవహిస్తుండటంతో లబ్ధిదారులు స్థలాల వద్దకు వెళ్లలేకపోతున్నారు. ఏటా వర్షాకాలంలో సగిలేరు పొంగుతుంది.. వాగుపై వంతెన నిర్మించకపోతే ఇళ్లు కట్టుకునే పరిస్థితి కనిపించడం లేదని లబ్ధిదారులు అంటున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణ సమీపంలో ఉన్న స్థలాలు మునిగిపోవడంతో మాజీ ఎమ్మెల్యే, తెదేపా బాధ్యుడు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అక్కడ వరినాట్లు వేసి నిరసన తెలిపారు.
ఇది చదవండి: