ప్రముఖ ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్‌కు చెందిన ఆశ్రమాల్లో మళ్లీ ఐటీ సోదాలు జరిగాయి. చిత్తూరు జిల్లా వరదయ్యపాలెంలోని ఏకం ఆలయం, ఉబ్బలమడుగు క్యాంపస్‌లోనూ మళ్లీ సోదాలు చేశారు. సరిగ్గా నెలరోజుల కిందట ఆశ్రమానికి సంబంధించిన ఆలయాలు, విశ్రాంతి భవనాల్లో తమిళనాడు ఐటీ విభాగం అధికారులు సోదాలు జరిపారు.
సుమారు రూ.500కోట్లు విలువైన లెక్కల్లో చూపని ఆస్తులు, బంగారం, నగదును గుర్తించారు. ఆ తర్వాత కల్కి భగవాన్ ఐటీ దాడులపై స్పందించారు. త్వరలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభిస్తామని ప్రకటించారు. నెలరోజుల తర్వాత మళ్లీ ఐటీ అధికారులు వరదయ్యపాలెంలో ఇవాళ సోదాలు నిర్వహించారు. 4 బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు... ఇతరులనెవ్వరినీ ఆశ్రమ పరిసరాల్లోకి అనుమతించకుండా సోదాలు నిర్వహించారు. అయితే ఈ తనిఖీల్లో గుర్తించిన అంశాలను అధికారికంగా ప్రకటించలేదు.
ఇవీ చదవండి