చిత్తూరు జిల్లా పరిధిలో ఊహించని వర్షాల కారణంగా 538 ప్రాంతాల్లో చెరువులకు సమస్యలు ఏర్పడినట్టు జలవనరుల శాఖ సీఈ హరి నారాయణ రెడ్డి తెలిపారు. తాత్కాలిక మరమ్మతులకు 5.92 కోట్లు, శాశ్వత పనులకు 160 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని అంచనాలు రూపొందించినట్టు చెప్పారు. హంద్రీనీవా తో పాటు తెలుగుగంగ కాలువకు సమస్య ఏర్పడ్డాయని వాటికి కూడా మరమ్మతులు చేపట్టనున్నట్టు స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో చేపట్టనున్న పనుల గురించి వివరించారు. వాగుల పునరుద్ధరణతో ముంపును నివారించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు హరి నారాయణ రెడ్డి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: నల్ల చెంబుకు అతీతశక్తులు... చివరకు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!