చిత్తూరు జిల్లా పుత్తూరులో తాజాగా ఎనిమిది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. పట్టణంలోని ఎన్జీవో కాలనీలో ఇద్దరు వాలంటీర్లకు, కార్వేటినగరం రోడ్డులోని ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలింది. గ్రామీణ మండలంలోని గొల్లపల్లి రామసముద్రం గ్రామాల్లోనూ మరో ఐదు పాజిటివ్ కేసులు రావటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మండలంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ నాగేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. రెడ్ జోన్ ప్రాంతాలను డీఎస్పీ మురళీధర్ పరిశీలించారు.
రెడ్‌జోన్‌లో పుత్తూరు... కొత్తగా 8 కరోనా కేసులు నమోదు..! - 8 new caroan acases in putturur
పుత్తూరులో గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు 8 కేసు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.