చిత్తూరు నగరపాలిక 18 డివిజన్లపై తెదేపా అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లారు. సంతకాలు ఫోర్జరీ చేసి, నామినేషన్లను ఉపసంహరించారంటూ.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. 18 డివిజన్లలో ఎన్నికలు నిలిపివేయాలని తెదేపా అభ్యర్థులు వేసిన పిటిషన్ పై దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు.
ఎస్‌ఈసీ వివరణ కోసం సోమవారానికి వాయిదా వేసినట్లు హైకోర్టు పేర్కొంది. సోమవారం మధ్యాహ్నం 2.15 గంటలకు తదుపరి వాదనలు విననున్నట్లు న్యాయస్థానం తెలిపింది. తిరుపతి 7వ వార్డు కేసుతో కలిపి వాదనలు వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది.
పిటిషన్పై ఎస్ఈసీ తరుపు న్యాయవాది..
తమకు అందిన ఫిర్యాదుల మేరకు ఇప్పటికే చిత్తూరు జిల్లా కలెక్టర్ ను ఆదేశించామని.. ఎస్ఈసీ తరపు న్యాయవాది తెలిపారు. రేపటికి నివేదిక వస్తుందని ధర్మాసనానికి వెల్లడించారు. పిటిషన్లకు విచారణార్హత లేదన్న ప్రభుత్వం తరపున న్యాయవాది.. ఏదైనా సమస్య ఉంటే ఎన్నికల ట్రిబ్యునల్ కు వెళ్లాలని పేర్కొన్నారు. వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
ఇవీ చూడండి: