చిత్తూరు జిల్లాలోని శేషాచల అడవులలో.. ఎర్రచందనం స్మగ్లర్లు పోలీసులకు సవాళ్లు విసురుతున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నా.. వారి కళ్లుగప్పి స్మగ్లర్లు ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నారు. నిన్నరాత్రి కూంబింగ్ చేపట్టిన టాస్క్ ఫోర్స్ అధికారులకు.. శేషాచల అడవుల్లోని నాగపట్ల బీట్‌లో స్మగ్లర్లు తారసపడ్డారు. అధికారుల రాకను పసిగట్టిన స్మగ్లర్లు.. దుంగలను అక్కడే వదిలేసి దట్టమైన అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. పోలీసులు.. ఒక నాటు తుపాకీ, మందుగుండు సామాగ్రితో పాటు నాలుగు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు.
ఒక స్థానిక స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఐతేపల్లికి చెందిన రాంబే మునికృష్ణగా గుర్తించారు. పారిపోయిన స్మగ్లర్ల కోసం గాలింపు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. మునికృష్ణ వన్యప్రాణులు వేటాడుతూ, 10 ఏళ్లుగా ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నాడు. టాస్క్ ఫోర్స్ పోలీసులకు పట్టుబడుతూ.. బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నాడు. పలు గ్రామాల్లోని యువకులకు డబ్బులు ఆశచూపి స్మగ్లింగ్ కార్యకలాపాలకు వాడుకొంటున్నట్టు విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు. అతనిని కోర్టులో హాజరు పరచగా.. 15 రోజులు రిమాండ్ విధించినట్టు తెలిపారు.
ఇదీ చదవండి:
జూవారీ సిమెంట్ మూసివేత ఆదేశాలను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు