చిత్తూరు జిల్లా హథీరాంజీ మఠంలో నగలు మాయమయ్యాయి. మఠం పరిధిలోనున్న తిరుమలలోని జాపాలి ఆంజనేయస్వామి ఆలయంలో దాదాపు 110బరువున్న బంగారు డాలరు మాయమైనట్లు నిర్వాహకులు గుర్తించారు. హథీరాంజీ మఠంలో అకౌంటెంట్‌గా విధులు నిర్వహించే గుర్రప్ప.. అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన స్థానంలో మరో వ్యక్తిని అకౌంటెంట్‌గా నియమిస్తూ మఠం బాధ్యతలను అప్పగించింది. మఠం పరిధిలో ఉన్న ఆలయాలకు సంబంధించి ఆభరణాల వివరాలను మఠ నిర్వహకులు తెలుసుకున్నారు. ఈ సమయంలో నగలు మాయమైన సంఘటన వెలుగు చూసింది. డాలర్ మాయమైనట్లు...రిజిస్టర్లో తేలింది.
మఠం పరిధిలోనున్న తిరుమలలోని జాపాలి ఆంజనేయస్వామి ఆలయంలో దాదాపు 110 గ్రాముల బరువున్న బంగారు డాలరు మాయమైనట్లు గుర్తించారు. జపాలి ఆలయ పూజారికి ఇచ్చినట్లు గుర్రప్ప తన రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. గుర్రప్ప రికార్డుల్లో ఉన్న మేరకు జపాలి ఆలయ పూజారిని విచారించినపుడు తనకు ఇవ్వలేదని తెలిపాడు. దీంతో నగల మాయంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మఠం మహంతు అర్జున్ దాస్ అంతర్గతంగా నగల మాయంపై విచారణ నిర్వహిస్తున్నారు. అధికారికంగా పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.
ఇదీ చూడండి. 'ప్రధాని నిధులిస్తుంటే.. కనీసం ఆయన ఫోటో లేకుండా ప్రచారం చేసుకుంటున్నారు'