చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఇంజనీరింగ్ విద్యార్థినిపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనలో బాధితురాలు, ఆమె తల్లి ముదివేడు పోలీస్ స్టేషన్ వద్ద కన్నీళ్ల పర్యంతమయ్యారు. తమకు న్యాయజరగలేదని విలపించారు. నిందితులపై నిర్భయ కేసు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. నిందితులను చూపించాలన్న బాధితుల వినతిని పోలీసులు సున్నితంగా తిరస్కరించారు. నిందితులు ఉన్నతాధికారుల విచారణలో ఉన్నారని పోలీసులు సమాధానమిచ్చారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని బాధితులు వెల్లడించారు.
.
ఇది కూడా చదవండి.